TS News: గీత చెట్లు నరికితే మూడేళ్లు జైలుకే: శ్రీనివాస్ గౌడ్‌

హైదరాబాద్‌: రాష్ట్రంలో తాటి, ఈత, ఖర్జూర, గిరక చెట్లను నరికి వేసే వారిపై కనీసం మూడేళ్లు  కఠిన కారాగార శిక్ష , జరిమానాలను విధించేలా చర్యలు తీసుకోవాలని ప్రొహిబిషన్‌, ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.

Published : 19 Jul 2023 23:34 IST

హైదరాబాద్‌: రాష్ట్రంలో తాటి, ఈత, ఖర్జూర, గిరక చెట్లను నరికి వేసే వారిపై కఠినంగా వ్యవహరించాలని, కనీసం మూడేళ్లు జైలు శిక్ష, జరిమానాలను విధించేలా చర్యలు తీసుకోవాలని ప్రొహిబిషన్‌, ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆగస్టు 31వ తేదీ లోగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి తాటి, ఈత, ఖర్జూర, గిరుక తాటి చెట్లకు నెంబరు (సంఖ్య) ఇవ్వాలని సూచించారు. కొత్త కల్లు దుకాణాలను మంజూరు చేసి టీసీఎస్‌, టీఎఫ్‌టీ కింద వారికి లైసెన్సులను మంజూరు చేయాలన్నారు. టీఎఫ్‌టీ లైసెన్సులను మెజారిటీ సభ్యుల అంగీకారంతో టీసీఎస్‌లుగా మార్చుకోవడానికి అవకాశం ఉన్నట్లు తెలిపారు. కల్లు దుకాణాల తరలింపు, రద్దు చేయబడిన కల్లు దుకాణాల పునరుద్ధరణ క్షేత్ర స్థాయిలో డీసీ స్థాయి అధికారి చూసేట్లు చర్యలు తీసుకోవాలని సూచించారు. తాటి చెట్టు ఎక్కే ఆధునిక సేఫ్టీ యంత్రాలను గీత కార్మికులకు అందించాలని స్పష్టం చేశారు. తెలంగాణకు హరితహారంలో భాగంగా ప్రభుత్వ భూముల్లో తాటి, ఈత, ఖర్జూర, గిరక తాటి చెట్లను పెంచాలన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ సంస్థ చైర్మన్ గజ్జెల నగేష్, రాష్ట్ర ప్రోహిబిషన్, ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ మమ్మద్ ముషారఫ్ ఫారూకి, అదనపు కమిషనర్ అజయ్ కుమార్, జాయింట్ కమిషనర్ శాస్త్రి, డిప్యూటీ కమిషనర్ డేవిడ్ రవికాంత్, సహాయ కమిషనర్‌లు చంద్రయ్య గౌడ్, శ్రీనివాస్, అనీల్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని