Seetarama project: సీతారామ ప్రాజెక్టు పూర్తి చేయడమే నా లక్ష్యం: మంత్రి తుమ్మల

సీతారామ ప్రాజెక్టుతో ఉమ్మడి ఖమ్మం జిల్లా సస్యశ్యామలం అవుతుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.

Published : 11 Jan 2024 15:27 IST

అశ్వారావుపేట: సీతారామ ప్రాజెక్టుతో ఉమ్మడి ఖమ్మం జిల్లా సస్యశ్యామలం అవుతుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా పది లక్షల ఎకరాలకు గోదావరి జలాలు అందించనున్నట్లు చెప్పారు. ప్రాజెక్టులో భాగంగా సత్తుపల్లి మండలం యాతాలకుంట వద్ద జరుగుతున్న టన్నెల్‌ పనులను బుధవారం పరిశీలించారు.

అనంతరం ప్రాజెక్టు అధికారులతో సమీక్షించి మీడియాతో మాట్లాడారు. ‘‘సీతారామ ప్రాజెక్టులో ప్రధానమైనది యాతాలకుంట టన్నెల్‌. పనులను రెండు వైపుల నుంచి చేసుకుంటూ రావాలి. ఆధునిక సాంకేతికతను వినియోగించి వేగంగా పనులు పూర్తి చేయాలి. టన్నెల్ పనులు పూర్తయితే బేతుపల్లి, లంకాసాగర్‌కు నీళ్లు అందుతాయి. గండుగులపల్లిలో నాలుగో పంప్ హౌస్ పనులు కొనసాగుతున్నాయి. సత్తుపల్లి నియోజకవర్గానికి యాతాలకుంట టన్నెల్ ప్రధానమైనది. యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేయాలి. సీతారామ ప్రాజెక్టును పూర్తి చేయడమే నా రాజకీయ లక్ష్యం’’ అని తుమ్మల తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని