Kaleshwaram: ఎన్‌డీఎస్‌ఏ నివేదిక ఆధారంగా మరమ్మతులతోపాటు చర్యలు: ఉత్తమ్‌

కాళేశ్వరం ప్రాజెక్టును పరిశీలించేందుకు రాష్ట్రానికి వచ్చిన నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ(ఎన్‌డీఎస్‌ఏ) కమిటీతో మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి,  అధికారులు సమావేశమయ్యారు.

Published : 06 Mar 2024 16:00 IST

హైదరాబాద్‌: కాళేశ్వరం ప్రాజెక్టును పరిశీలించేందుకు రాష్ట్రానికి వచ్చిన నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ(ఎన్‌డీఎస్‌ఏ) కమిటీతో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, అధికారులు సమావేశమయ్యారు. ఎన్‌డీఎస్‌ఏ కమిటీకి పూర్తిగా సహకరిస్తామని, ప్రాథమిక నివేదిక వీలైనంత త్వరగా ఇవ్వాలని కమిటీని మంత్రి ఉత్తమ్‌ కోరారు. నివేదిక ఆధారంగా మరమ్మతులతోపాటు చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. 

‘‘మోదీ విధానాల వల్లే దేశంలో నీటిపారుదల ప్రాజెక్టుల్లో అవినీతి జరుగుతోంది. కాళేశ్వరం భారాసకు ఏటీఎంగా మారటానికి మోదీ విధానాలే కారణం. కార్పొరేషన్ల ద్వారా భారాస ప్రభుత్వం రూ.84వేల కోట్ల రుణం తీసుకుంది. మమ్మల్ని విమర్శించే అర్హత భాజపాకు లేదు’’అని ఉత్తమ్‌ అన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని