Uttam Kumar Reddy: డిండి, ఎస్‌ఎల్‌బీసీ పనులు రెండేళ్లలో పూర్తి చేయాలి: మంత్రి ఉత్తమ్‌

డిండి, ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టు పనులను రెండేళ్లలో పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి ఆదేశించారు.

Published : 22 Feb 2024 23:13 IST

హైదరాబాద్‌: డిండి, శ్రీశైలం ఎడమగట్టు కాలువ(ఎస్‌ఎల్‌బీసీ) ప్రాజెక్టు పనులను రెండేళ్లలో పూర్తి చేయాలని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి  అధికారులను ఆదేశించారు. ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టును అత్యంత ప్రాధాన్యతగా తీసుకొని యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టాలన్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ప్రాజెక్టు నిర్మాణంలో తీవ్ర జాప్యం జరిగిందన్నారు. ఎస్‌ఎల్‌బీసీలో 44 కి.మీ. పొడవైన సొరంగ మార్గంలో 9 కి.మీ. పనులు పూర్తి చేయాల్సి ఉందని తెలిపారు. సొరంగం రెండు వైపుల నుంచి పనులు చేపట్టి వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సూచించారు. నిర్ణీత కాల వ్యవధిలో పనులు పూర్తి చేసేందుకు అధికారుల కమిటీ ఏర్పాటు చేయాలని నీటిపారుదల కార్యదర్శి రాహుల్ బొజ్జాను మంత్రి ఆదేశించారు. డిండి ప్రాజెక్టులో 95 శాతం పనులు పూర్తయ్యాయని, రూ.90 కోట్లతో భూసేకరణ చేపట్టాల్సి ఉందన్నారు. పర్యావరణ, అటవీ అనుమతుల ప్రక్రియ వేగవంతం చేయాలని ఉత్తమ్‌ ఆదేశించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని