కాళేశ్వరం తప్పిదాలపై విజిలెన్స్‌ విచారణ ప్రారంభం: మంత్రి ఉత్తమ్‌

జలసౌధలో నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు.

Updated : 13 Jan 2024 15:30 IST

హైదరాబాద్‌: జలసౌధలో నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. కొత్త ఆయకట్టుకు సాగునీరు ఇచ్చే ప్రణాళికలపై చర్చించారు. జూన్‌ నాటికి కొత్తగా 50 వేలు, డిసెంబర్‌ నాటికి 4.5 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. నీటిపారుదల శాఖలో గత పాలకులు అప్పులు ఎక్కువ చేశారని.. అయినా అందుకు తగిన ప్రతిఫలం రాలేదన్నారు. అందుకే అవసరం మేరకు ఖర్చులు చేయాలన్నారు. కాళేశ్వరం తప్పిదాలపై విజిలెన్స్‌ విచారణ ప్రారంభమైనట్లు చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని