Vizag: భర్తను రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకొని.. మిస్‌ వైజాగ్‌ నక్షత్ర ఆందోళన

విడాకులు ఇవ్వకుండా తన భర్త మరో మహిళను వివాహం చేసుకున్నారని ఆరోపిస్తూ మిస్‌ వైజాగ్‌ నక్షత్ర ఆందోళనకు దిగిన ఘటన విశాఖలో కలకలం రేపింది.

Updated : 30 May 2024 18:06 IST

విశాఖ: విడాకులు ఇవ్వకుండా తన భర్త మరో మహిళను వివాహం చేసుకున్నారని ఆరోపిస్తూ మిస్‌ వైజాగ్‌ నక్షత్ర ఆందోళనకు దిగిన ఘటన విశాఖలో కలకలం రేపింది. గతంలో మిస్‌ వైజాగ్‌ టైటిల్‌ గెలుచుకున్న నక్షత్ర 2017లో తేజ అనే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో తేజ మరో మహిళతో వేరు కాపురం పెట్టారని నక్షత్ర ఆరోపిస్తోంది. ఈ విషయంపై దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలో తన భర్త ఆ మహిళతో కలిసి ఉండగా నక్షత్ర మీడియా ప్రతినిధులతో వెళ్లి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ నేపథ్యంలో తేజ, నక్షత్ర మధ్య చిన్నపాటి ఘర్షణ చోటు చేసుకుంది. షూటింగ్‌ ఆఫీసు వద్దకు వచ్చి నక్షత్ర గొడవ చేయడంతో పోలీసులు ఆమెకు సర్దిచెప్పి అక్కడి నుంచి తీసుకెళ్లారు. ఇదిలా ఉండగా.. నక్షత్ర తనపై తప్పుడు కేసులు పెట్టిందని తేజ ఆరోపిస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు