MLC Kavita: ఈనెల 23వరకు ఈడీ కస్టడీకి ఎమ్మెల్సీ కవిత

దిల్లీ మద్యం కేసులో అరెస్టయిన భారాస ఎమ్మెల్సీ కవితను ఈడీ కస్టడీకి అనుమతిస్తూ రౌస్‌ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించింది.

Updated : 16 Mar 2024 17:38 IST

దిల్లీ: దిల్లీ మద్యం కేసులో అరెస్టయిన భారాస ఎమ్మెల్సీ కవితను ఈడీ కస్టడీకి అనుమతిస్తూ రౌస్‌ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించింది. శుక్రవారం సాయంత్రం బంజారాహిల్స్‌లోని ఆమె నివాసంలో అదుపులోకి తీసుకున్న ఈడీ అధికారులు ఈరోజు ఉదయం సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరు పర్చారు. సుదీర్ఘ వాదనల తర్వాత మార్చి 23 వరకు కవితను ఈడీ కస్టడీకి అనుమతిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. 23న తిరిగి కోర్టులో హాజరు పర్చాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రతి రోజు కుటుంబ సభ్యులు, న్యాయవాదులను కలిసేందుకు, ఇంటి నుంచి తెచ్చిన ఆహారం తీసుకునేందుకు ప్రత్యేక కోర్టు అనుమతించింది. ఆమె తరఫున సీనియర్‌ న్యాయవాది విక్రమ్‌ చౌదరి వాదనలు వినిపించగా.. ఈడీ తరఫున ఎన్‌.కె మట్టా, జోయబ్‌ హుసేన్‌ వాదించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని