Delhi liqour scam: ఎమ్మెల్సీ కవిత మాజీ ఆడిటర్‌ బుచ్చిబాబుకు బెయిల్‌ మంజూరు

దిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఇటీవల అరెస్టయిన తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాజీ ఆడిటర్‌ గోరంట్ల బుచ్చిబాబుకు ఊరట లభించింది. ఆయనకు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరైంది.

Updated : 06 Mar 2023 16:03 IST

దిల్లీ: మద్యం కుంభకోణం కేసు (Delhi liqour scam)లో అరెస్టయిన తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) మాజీ ఆడిటర్‌ గోరంట్ల బుచ్చిబాబుకు బెయిల్‌ మంజూరైంది. ఈ మేరకు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేస్తూ దిల్లీలోని రౌస్‌ అవెన్యూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. పాస్‌పోర్టు అప్పజెప్పాలని, రూ.2లక్షల పూచీకత్తు ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. దిల్లీ లిక్కర్‌ స్కామ్‌ వ్యవహారంలో ఫిబ్రవరి 8న బుచ్చిబాబును కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

అదే రోజున సీబీఐ అధికారులు ప్రత్యేక న్యాయస్థానం ఎదుట హాజరుపర్చగా.. కోర్టు మొదట మూడు రోజుల జ్యుడిషియల్‌ కస్టడీ విధించింది. అనంతరం దాన్ని మరో 14 రోజులు పొడిగించింది. ఆ గడువు ముగియడంతో ఫిబ్రవరి 25వ తేదీ మరోసారి న్యాయస్థానంలో హాజరుపర్చగా ప్రత్యేక జడ్జి ఎంకే నాగ్‌పాల్‌ జ్యుడిషియల్‌ కస్టడీని మరో 14 రోజులు పొడిగించారు. ఈ కేసులో బెయిల్‌ కోసం ఆయన పెట్టుకున్న పిటిషన్‌ బుధవారం విచారణకు రాగా.. తీర్పును ప్రత్యేక జడ్జి మరుసటి రోజుకు వాయిదా వేశారు. గురువారం ప్రత్యేక జడ్జి సెలవులో ఉండడంతో తీర్పు వాయిదా పడింది. తాజాగా బుచ్చిబాబుకు బెయిల్‌ మంజూరు చేస్తూ రౌస్‌ అవెన్యూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని