MLC Kavitha: విచారణకు హాజరు కాలేను.. సీబీఐకి ఎమ్మెల్సీ కవిత లేఖ

విచారణకు సోమవారం హాజరు కాలేనని భారాస ఎమ్మెల్సీ కవిత సీబీఐకి లేఖ రాశారు.

Published : 25 Feb 2024 18:15 IST

హైదరాబాద్‌: విచారణకు సోమవారం హాజరు కాలేనని భారాస ఎమ్మెల్సీ కవిత సీబీఐకి లేఖ రాశారు. 41ఏ నోటీసులు ఉపసంహరించుకోవాలని కోరారు. ‘‘సీబీఐకి సమాచారం కావాలంటే వర్చువల్‌ పద్ధతిలో హాజరవుతా. ముందే నిర్ణయించిన కార్యక్రమాల దృష్ట్యా విచారణకు హాజరుకాలేను. 41ఏ నోటీసులు ఇవ్వడం సబబు కాదు. గతంలో సెక్షన్‌ 160 ద్వారా నోటీసు ఇచ్చారు. గత నోటీసుకు ప్రస్తుత సెక్షన్‌ 41ఏ నోటీసు పూర్తి విరుద్ధం. సెక్షన్‌ 41ఏ ద్వారా ఏ పరిస్థితుల్లో నోటీసులు ఇచ్చారో స్పష్టత లేదు. నోటీసు జారీ చేసిన సందర్భం కూడా ఆలోచింపజేస్తోంది. పార్లమెంట్‌ ఎన్నికల దృష్ట్యా అనేక ప్రశ్నలకు తావిస్తోంది’’ అని లేఖలో పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని