MMTS Trains cancelled: 22 ఎంఎంటీఎస్‌, 4 డెమూ రైళ్లు రద్దు.. కారణం ఇదే!

MMTS Trains | హైదరాబాద్‌ జంట నగరాల్లో సర్వీసులందించే పలు ఎంఎంటీఎస్‌ రైళ్లను రెండు రోజుల పాటు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు.

Published : 24 May 2024 18:16 IST

సికింద్రాబాద్‌: హైదరాబాద్‌ జంట నగరాల్లో ఎంఎంటీఎస్‌ రైళ్లలో ప్రయాణించేవారికి కీలక అలర్ట్‌! ఈనెల 25, 26 తేదీల్లో పలు ఎంఎంటీఎస్‌ రైళ్లు, నాలుగు డెమూ సర్వీసులు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ ఆధునికీకరణ పనులు, ఫుట్‌ ఓవర్‌ వంతెనల (FOB)ల నిర్మాణం నేపథ్యంలో సికింద్రాబాద్‌-ఫలక్‌నుమా, మేడ్చల్‌-సికింద్రాబాద్‌; లింగంపల్లి-మేడ్చల్‌, హైదరాబాద్‌-మేడ్చల్‌ మధ్య సేవలందించే 22 ఎంఎంటీఎస్‌ సర్వీసుల్ని రద్దు చేస్తున్నట్లు చీఫ్‌ పీఆర్వో సీహెచ్‌.రాకేశ్‌ ఓ ప్రకటనలో వెల్లడించారు. వీటితో పాటు సిద్దిపేట-సికింద్రాబాద్‌ మధ్య సర్వీసులందించే నాలుగు డెమూ రైళ్ల రద్దు చేస్తున్నట్లు తెలిపారు. కొన్ని రైళ్లను రెండు రోజుల పాటు, మరికొన్నింటిని ఒక్కరోజు పాటు సర్వీసులు రద్దు చేస్తున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. రద్దయిన రైళ్ల వివరాలివే.. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని