Kishan Reddy: తెలుగు రాష్ట్రాల పట్ల మోదీ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది : కిషన్‌రెడ్డి

గత పదేళ్లలో దేశంలో రైల్వే గణనీయమైన అభివృద్ధి సాధించిందని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి అన్నారు. తెలుగు రాష్ట్రాల పట్ల మోదీ ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తోందని పేర్కొన్నారు.

Published : 12 Mar 2024 11:40 IST

హైదరాబాద్‌: గత పదేళ్లలో దేశంలో రైల్వే గణనీయమైన అభివృద్ధి సాధించిందని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి అన్నారు. తెలుగు రాష్ట్రాల పట్ల మోదీ ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లను ప్రవేశపెట్టారని కొనియాడారు. అహ్మదాబాద్ నుంచి ప్రధాని నరేంద్ర మోదీ సికింద్రాబాద్ - విశాఖ మార్గంలో రెండో వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను వర్చువల్‌గా జెండా ఊపి ప్రారంభించారు. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో కిషన్ రెడ్డి, వర్చువల్‌గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఇప్పటికే మూడు వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లు నడుస్తున్నాయని.. ఇవాళ మరో ఎక్స్‌ప్రెస్‌ను మోదీ ప్రారంభించడం సంతోషకరమన్నారు. చర్లపల్లి టెర్మినల్ పనులు 90 శాతం పూర్తయ్యాయని..  మరికొద్ది రోజుల్లోనే ప్రారంభిస్తామని చెప్పారు. దేశవ్యాప్తంగా మొత్తం 10 వందేభారత్‌లను ప్రధాని నేడు వర్చువల్‌గా ప్రారంభించారు. దీంతో దేశంలో మొత్తం ఈ రైళ్ల సంఖ్య 50 దాటడం విశేషం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని