రాయలసీమ నుంచి ముందుకు కదలని రుతుపవనాలు.. ఏపీ, తెలంగాణలో అసాధారణ పరిస్థితులు

ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు రాయలసీమ నుంచి ముందుకు కదలడం లేదు. ఈ నెల 11న ఏపీలో ప్రవేశించిన రుతుపవనాలు అక్కడే నిలిచిపోయాయి.

Updated : 16 Jun 2023 19:51 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు రాయలసీమ నుంచి ముందుకు కదలడం లేదు. ఈ నెల 11న ఏపీలో ప్రవేశించిన రుతుపవనాలు అక్కడే నిలిచిపోయాయి. శ్రీహరికోట, కర్ణాటకలోని రత్నగిరి ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు నిలిచిపోయినట్లు వాతావరణశాఖ తెలిపింది. ఇప్పటికే దేశంలోని సగానికిపైగా ప్రాంతాల్లో  రుతుపవనాలు విస్తరించాల్సి ఉన్నప్పటికీ అలా జరగలేదు. రుతుపవనాలు నిలిచిపోవడంతో పలు రాష్ట్రాల్లో పడగాలులు వీస్తున్నాయి.

ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో అసాధారణ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదువుతున్నాయి. జూన్‌ 15 దాటినా తీవ్రమైన ఎండలతో ప్రజలు సతమతవుతున్నారు. ఏపీ వ్యాప్తంగా 231 మండలాల్లో తీవ్రస్థాయిలో వేడి పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నెల 18 తర్వాత కోస్తా, రాయలసీమలో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. మరోవైపు తెలంగాణలో 20 తర్వాత వర్షాలు వడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని