bunkers: భూమి కింద స్వర్గాలు.. బంకర్లు కావవి విలాస కేంద్రాలు
యుద్ధం ముంచుకొచ్చినప్పుడు.. క్షిపణులు, బాంబుల వర్షం కురుస్తున్నప్పుడు.. దేశ నేతల నుంచి సామాన్య జనం దాకా ప్రాణాలు కాపాడుకోవడానికి ఆశ్రయించేది బంకర్లనే.
యుద్ధం ముంచుకొచ్చినప్పుడు.. క్షిపణులు, బాంబుల వర్షం కురుస్తున్నప్పుడు.. దేశ నేతల నుంచి సామాన్య జనం దాకా ప్రాణాలు కాపాడుకోవడానికి ఆశ్రయించేది బంకర్లనే. నాటి ప్రపంచ యుద్ధాల నుంచి నేటి రష్యా-ఉక్రెయిన్ వార్ దాకా.. అన్నిచోట్లా ఇదే పరిస్థితి. కానీ నేలమాళిగలంటే.. ఇప్పుడు తల దాచుకునే చోటు మాత్రమే కాదు.. విలాసాల కేంద్రాలు కూడా. ప్రళయం రానీ.. వినాశనం సంభవించనీ.. డబ్బున్న మహరాజులు, చేతిలో అధికారం ఉన్న నేతలు పాతాళంలోకి వెళ్లిపోయి సకల భోగాలు అనుభవించేలా కొన్నింటిని మలిచారు. అలాంటి ప్రపంచంలోని అత్యంత విలాసవంతమైన కొన్ని బంకర్ల వివరాలు.
ది ఒప్పిడమ్; దేశం: చెక్ రిపబ్లిక్; నిర్మించింది: 1984
ఇది ప్రపంచంలోనే అతిపెద్ద బిలియనీర్ బంకర్. రెండు కొండల్ని తొలిచి 3.23లక్షల చదరపు అడుగుల వైశాల్యంలో ఈ విశాలమైన బంకర్‌ని నిర్మించారు. ఇక్కడ 6,750 చదరపు అడుగుల్లో ఒకటి, 1,720 చ.అడుగుల్లో ఆరు భవంతులున్నాయి. ఐదు నక్షత్రాల హోటల్‌లో ఉండే సౌకర్యాలకు నిలయమిది. స్విమ్మింగ్‌పూల్, రెయిన్‌ఫాల్ షవర్లు, స్పా, పెద్ద గార్డెన్, సినిమా థియేటర్, బిలియర్డ్స్ ఆట గది, సమావేశ మందిరం, జిమ్, పెద్ద బార్, ఆసుపత్రి.. అందుబాటులో ఉంటాయి. అణుదాడుల్ని సైతం తట్టుకునేలా దీన్ని పటిష్ఠంగా నిర్మించారు. ఇందులోకి ప్రవేశిస్తే పదేళ్లపాటు ఎలాంటి ఇబ్బంది లేకుండా రహస్య జీవితం గడపొచ్చు. దీని నిర్మాణానికి అప్పట్లోనే రూ.62 కోట్ల ఖర్చైంది.
వివోస్ యూరోపా వన్; దేశం: రోథన్‌స్టీన్, జర్మనీ
పర్వతం కింద నిర్మించిన ఈ నేలమాళిగ అణు దాడి, బయోవార్, ఉగ్రదాడులు, ఎలక్ట్రో-మాగ్నెటిక్, సోలార్ ఫ్లేర్, సునామీ.. చివరికి భూకంపాలు కూడా తట్టుకునేంత దృఢంగా తయారు చేశామంటోంది నిర్మాణదారు సంస్థ వివోస్. రోథన్‌స్టీన్ ప్రాంతంలోని పర్వతాన్ని 400 అడుగులు తొలిచి డెబ్భై ఎకరాల విస్తీర్ణంలో ఈ పాతాళ స్వర్గాన్ని నిర్మించారు. ఇక్కడ పెద్ద కుటుంబాలు ఉండేలా, ఒక్కోటి 2.5వేల చదరపు అడుగులతో 34 భవనాలు నిర్మించి సకల సదుపాయాలు ఏర్పాటు చేశారు. వంటగది, పడకగది, డీలక్స్ బాత్‌రూమ్, స్విమ్మింగ్ పూల్, సినిమా థియేటర్, జిమ్, బార్‌లాంటివి ఉన్నాయి. ద్వారాలు, గోడలు.. మిస్సైళ్ల దాడిని సైతం తట్టుకునేలా మలిచారు. ఇక్కడ నెలపాటు తలదాచుకోవాలంటే కోట్ల రూపాయలు చెల్లించాల్సిందే.
సర్వైవల్ కాండో; ప్రాంతం: కాన్సాస్, అమెరికా
ప్రచ్ఛన్న యుద్ధం కాలం రోజుల్లో నిర్మించిన ఈ బంకర్‌ని తర్వాత కాలంలో ఆధునికీకరించారు. ఇది పదిహేను అంతస్తుల్లో నిర్మించిన భారీ నిర్మాణం. జపాన్‌లోని నాగసాకి నగరంపై ప్రయోగించిన అణుబాంబుకి వంద రెట్లు ఎక్కువ సామర్థ్యం ఉన్న బాంబు దాడి జరిగినా తట్టుకుంటుంది. భూమికి 201 అడుగుల లోతులో నిర్మించారు. గ్రంథాలయం, వాటర్ పార్క్, సినిమా హాలు, ఫిట్‌నెస్ సెంటర్, బార్.. వీటన్నింటినీ పర్యవేక్షించే ఒక కమాండ్ కంట్రోల్ గది ఉన్నాయి. ఏకధాటిగా ఐదేళ్లపాటు ఉపయోగించేలా విద్యుత్తు, నీటి నిల్వలు ఉన్నాయి ఇక్కడ. 24 గంటలూ పగటిపూట వాతావరణాన్ని తలపించేలా ఎల్‌ఈడీ లైట్లు అమర్చారు.
ట్రైడెంట్ లేక్; ప్రదేశం: టెక్సాస్, అమెరికా
ఏడు వందల ఎకరాల్లో విస్తరించి ఉన్న విశాలమైన బంకర్ ఇది. మొత్తం 600 బ్లాకులున్నాయి. గోల్ఫ్‌కోర్స్, అథ్లెటిక్ సెంటర్, పోలో మైదానం, 12 హెలిప్యాడ్‌లు.. అందుబాటులో ఉన్నాయి. దీన్ని నిర్మించిన సంస్థ ఓ అడుగు ముందుకేసి డీఎన్‌ఏ కూడా భద్రపరిచే డీఎన్‌ఏ వాల్ట్ కూడా ఏర్పాటు చేసింది. ఈ బంకర్ మధ్యలో 55వేల చదరపు అడుగుల భారీ ఫౌంటెయిన్ ఏర్పాటు చేశారు. ఐదు నక్షత్రాల హోటల్‌లో ఉండేలా ఇంటీరియర్‌ని తీర్చిదిద్దారు.
లాస్‌వెగాస్ అండర్‌గ్రౌండ్ షెల్టర్; ప్రదేశం: లాస్‌వెగాస్, అమెరికా
1960లో నిర్మితమైంది. పర్వతాల మధ్యలో విశాలమైన బంకర్ ఉన్నట్టు నర మానవుడికి కూడా తెలియకుండా జాగ్రత్తపడ్డారు. భూమికి 26 అడుగుల లోపల 14,620 చదరపు అడుగుల వైశాల్యంలో నిర్మించారు. వంటగది, పడకగది, ఇంటీరియర్ డిజైన్లు అప్పటికాలంలోనే రూపొందించినా ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయి. బంకర్ మధ్యలో అక్కడక్కడ కృత్రిమమైన చెట్లు పెంచారు. స్పా, అతిథిగృహం, ఫౌంటెయిన్, నైట్‌క్లబ్, బార్, ఐదు పడకగదులు, ఆరు విలాసవంతమైన బాత్‌రూమ్‌లు ఉన్నాయి. అన్నిరకాల బాంబు దాడులు తట్టుకుంటుంది.
ది అరిస్ట్రోక్రాట్; ప్రదేశం: టెక్సాస్, అమెరికా
యుద్ధం సంభవించినప్పుడు దేశంలోని కీలకమైన యాభైమంది నేతలు, అధికారులు రహస్య జీవితం గడిపేందుకు అన్ని వసతులతో ఈ నేలమాళిగ నిర్మించారు. స్విమ్మింగ్‌పూల్, జిమ్, థియేటర్, గన్ రేంజ్, విశాలమైన పడకగదులు ఉన్నాయి. ఖరీదైన వస్తువులు, అత్యవసర ప్రయాణాలకు వాహనాలు ఉంచడానికి గ్యారేజీ ఏర్పాటు చేశారు. మిస్సైళ్లు, అణుదాడులను సైతం తట్టుకునేంత దృఢంగా ఉంటుందీ బంకర్.
ది సేఫ్ హౌజ్; ప్రదేశం: వార్సా, పోలెండ్
మిగతా బంకర్లతో పోలిస్తే దీని ప్రత్యేకత ఏంటంటే.. లైట్లతో కాకుండా సహజమైన వెలుతురు లోపలంతా పరుచుకునేలా దీని డిజైన్ చేశారు. దానికోసం లోహపు అద్దాలు వాడారు. ఇది 6,100 చదరపు అడుగుల వైశాల్యంతో ఉంటుంది. అణుదాడుల్ని సైతం తట్టుకునేలా నిర్మాణం ఉంటుంది. హంసతూలికా తల్పాలు, స్టార్‌హోటళ్లకి ఏమాత్రం తీసిపోని ఫర్నీచర్ సిద్ధం చేశారు. స్విమ్మింగ్‌పూల్, సినిమా థియేటర్, ఆసుపత్రి.. ఇలాంటి వినోద, అత్యవసర ఏర్పాట్లెన్నో ఉన్నాయి.
గ్రీన్‌బ్రీర్ బంకర్; ప్రదేశం: పశ్చిమ వర్జీనియా, అమెరికా
అమెరికా-రష్యాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జోరు మీదున్నప్పుడు అమెరికన్ కాంగ్రెస్ సభ్యులను సురక్షితంగా ఉంచేందుకు యూఎస్ ప్రభుత్వం ఈ భారీ బంకర్ ఏర్పాటు చేసింది. అవసరమైతే కాంగ్రెస్ ఉభయ సభల సమావేశాలు సైతం ఏర్పాటు చేయడానికి అనుగుణంగా సకల సౌకర్యాలతో నిర్మించారు. అణుదాడులను సైతం తట్టుకోగలదు. తర్వాత కాలంలో ప్రముఖ హోటళ్ల నిర్వహణాసంస్థ గ్రీన్‌బ్రీర్ దీన్ని తన అధీనంలోకి తీసుకొని మరింత ఆధునికీకరించింది. విలాసవంతమైన సదుపాయాలు కల్పించింది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
IPL 2023: సెహ్వాగ్ టాప్-5 బ్యాటర్లు వీరే.. లిస్ట్‌లో లేని విరాట్, గిల్!
-
World News
Asiana Airlines: త్వరగా విమానం దిగాలని.. గాల్లో ఎమర్జెన్సీ డోర్ తెరిచాడట..!
-
Movies News
Vicky Kaushal: సల్మాన్ వ్యక్తిగత సిబ్బంది పక్కకు తోసేసిన ఘటనపై స్పందించిన విక్కీ కౌశల్
-
India News
NITI Aayog: మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ భేటీ.. 9 మంది సీఎంలు డుమ్మా
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Politics News
TDP-Mahanadu: పిచ్చోడి చేతిలో రాయిలా ఉంది రాష్ట్రం పరిస్థితి: చంద్రబాబు