Breast Cancer: రొమ్ము క్యాన్సర్‌ ఎందుకు వస్తుందో..? ఈ కారణాలు తెలుసుకోండి..!

రొమ్ములో ఏ కాస్త గట్టిగా తగిలినా మహిళలు హడలిపోతున్నారు. అది క్యాన్సర్‌ కావొచ్చనే భయంతో వణికిపోతున్నారు. మారుతున్న జీవనశైలితో మహిళల్లో ఎక్కువగా కనిపిస్తున్న క్యాన్సర్లలో రొమ్ము క్యాన్సర్‌ ఒకటి. ఇది వారతస్వంగా రావొచ్చు..అమ్మ అయిన తర్వాత శరీరంలో వచ్చే మార్పులు వచ్చే అవకాశం ఉందని వైద్యులు సూచిస్తున్నారు.

Published : 27 Oct 2022 12:27 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రొమ్ములో ఏ కాస్త గట్టిగా తగిలినా మహిళలు హడలిపోతున్నారు. అది క్యాన్సర్‌ కావొచ్చనే భయంతో వణికిపోతున్నారు. మారుతున్న జీవనశైలితో మహిళల్లో ఎక్కువగా కనిపిస్తున్న క్యాన్సర్లలో రొమ్ము క్యాన్సర్‌ ఒకటి. ఇది వారసత్వంగా రావొచ్చు..అమ్మ అయిన తర్వాత శరీరంలో వచ్చే మార్పులు వచ్చే అవకాశం ఉందని వైద్యులు సూచిస్తున్నారు. క్యాన్సర్‌ వస్తే మరణమే అనే భావన చాలా మందిలో ఉండటంతో ఆసుపత్రికి వెళ్లడానికి జంకుతున్నారని  బ్రెస్ట్‌ ఆంకాలజిస్టు డాక్టర్‌ చైత్ర శొంఠినేని పేర్కొన్నారు.

అన్ని గడ్డలు క్యాన్సర్‌ కాదు..

మహిళల రొమ్ములో కనిపించే గడ్డలన్నీ క్యాన్సర్‌ కాదు..చాలా మంది ఆసుపత్రికి అనుమానంతో వస్తారు. వాళ్లలో ఒకరిద్దరికి మాత్రమే క్యాన్సర్‌ లక్షణాలు కనిపిస్తాయి. గడ్డలున్నట్టు కనిపిస్తే సాధ్యమయినంత తొందరగా వైద్యుల వద్దకు వెళ్లాలి. అమ్మ, అమ్మమ్మలకు రొమ్ము క్యాన్సర్‌ ఉంటే వాళ్ల పిల్లలకు కేవలం 10 శాతం మాత్రమే వచ్చే వీలుంటుంది. మద్యం, ఊబకాయం, వయసు మళ్లిన తర్వాత గర్భధారణ, పిల్లలకు పాలు పట్టకపోవడం, పెళ్లి కాకుండా ఉన్నవాళ్లకు క్యాన్సర్‌ వచ్చే వీలుండవచ్చు. తొలి దశలో ఉన్నట్లయితే తొందరగానే నివారించవచ్చు. తీవ్రమైనపుడే కష్టంగా ఉంటుంది. బ్రెస్టు ఇంప్లాంట్స్‌తో క్యాన్సర్‌ ముప్పు ఉండదు. 

తొలగించక తప్పదా...?

రొమ్ము క్యాన్సర్‌ వస్తే రొమ్ము మొత్తం తీసేయాల్సిన అవసరం రాకపోవచ్చు. క్యాన్సర్‌ పరిధి ఆధారంగా చికిత్స ఉంటుంది. రొమ్ము మొత్తం తీసేసినా కూడా ఇంప్లాంట్స్‌ పెట్టడంతో ఎలా మార్పు కనిపించదు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని