దేవాన్ష్‌ పుట్టినరోజు.. శ్రీవారిని దర్శించుకున్న నారా లోకేశ్‌ కుటుంబ సభ్యులు

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ (Nara Lokesh) కుటుంబసభ్యులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

Updated : 21 Mar 2024 14:04 IST

తిరుమల: తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ (Nara Lokesh) కుటుంబసభ్యులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కుమారుడు నారా దేవాన్ష్‌ జన్మదినం సందర్భంగా లోకేశ్‌- బ్రాహ్మణి దంపతులు, నారా భువనేశ్వరి స్వామివారి దర్శనానికి వచ్చారు. రంగనాయకుల మండపంలో అర్చకులు వారికి వేదాశీర్వచనం చేశారు. దేవాన్ష్‌ పుట్టినరోజును పురస్కరించుకుని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో భక్తులకు కుటుంబసభ్యులు అన్నదానం చేయనున్నారు. గురువారం ఉదయం శ్రీవారి భక్తులకు అల్పాహారం వడ్డించారు. ఒక్కరోజు అన్న వితరణకు అయ్యే ఖర్చు రూ.38 లక్షలను తితిదే అన్నప్రసాదం ట్రస్ట్‌కు లోకేశ్‌ విరాళమిచ్చారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని