Kaleshwaram Project: ఇంజినీర్లతో రెండో రోజూ ఎన్‌డీఎస్‌ఏ నిపుణుల కమిటీ భేటీ

ఎన్‌డీఎస్‌ఏ (నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ) నిపుణుల కమిటీ రెండో రోజు గురువారం సెంట్రల్‌ డిజైన్‌ ఆర్గనైజేషన్‌ ఇంజినీర్లతో సమావేశమైంది.

Published : 21 Mar 2024 12:16 IST

హైదరాబాద్‌: ఎన్‌డీఎస్‌ఏ (నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ) నిపుణుల కమిటీ రెండో రోజు సెంట్రల్‌ డిజైన్‌ ఆర్గనైజేషన్‌ ఇంజినీర్లతో సమావేశమైంది. ఎర్రమంజిల్‌లోని జలసౌధలో చంద్రశేఖర్‌ అయ్యర్‌ కమిటీ ఇంజినీర్లతో విడివిడిగా చర్చలు జరుపుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీ డిజైన్ల వివరాలపై ఆరా తీస్తోంది. వాటిని రూపొందించిన సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ ఇంజినీర్లతో ఇప్పటికే బుధవారం సమావేశమైంది. గురువారమూ ఈ భేటీ కొనసాగింది. 

ప్రాజెక్టు నిర్మాణంలో బాధ్యులైన ఇంజినీర్లతో విడివిడిగా సమావేశమవుతున్న చంద్రశేఖర్ అయ్యర్, సభ్యులు.. డిజైన్లకు సంబంధించిన వివరాలు తీసుకుంటున్నారు. ఆనకట్టల నిర్వహణ బాధ్యతలు చూసే ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ విభాగం నుంచి కమిటీ సమగ్ర వివరాలు కోరింది. 2019లో సమస్యలు ఉత్పన్నమైనప్పటి నుంచి తీసుకున్న చర్యలు, చేపట్టిన తనిఖీల వివరాలు ఇవ్వాలని స్పష్టం చేసింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టల నిర్మాణ పనులు చేసిన గుత్తేదార్ల ప్రతినిధులతోనూ నేడు సమావేశం కానుంది. మూడు ఆనకట్టల మోడల్స్‌ను కమిటీ శుక్రవారం పరిశీలించనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని