Neerabh kumar prasad: ఏపీ నూతన సీఎస్‌గా నీరభ్‌కుమార్‌ ప్రసాద్‌.. ఉత్తర్వులు జారీ

ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌)గా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి నీరభ్‌ కుమార్‌ ప్రసాద్‌ నియమితులయ్యారు.

Updated : 07 Jun 2024 10:15 IST

అమరావతి: ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌)గా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి నీరభ్‌ కుమార్‌ ప్రసాద్‌ నియమితులయ్యారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. 1987 బ్యాచ్‌కు చెందిన ఆయన.. ప్రస్తుతం రాష్ట్ర పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఇప్పటి వరకు సీఎస్‌గా ఉన్న కె.ఎస్‌.జవహర్‌రెడ్డి గురువారం సెలవుపై వెళ్లారు. ఈ నేపథ్యంలో నూతన సీఎస్‌ నియామకం జరిగింది. కొత్త సీఎస్‌ నియమాకం జరిగినందున జవహర్‌రెడ్డిని బదిలీ చేశారు. బుధవారం ఉదయం తెదేపా అధినేత చంద్రబాబును నీరభ్‌ కుమార్‌ మర్యాదపూర్వకంగా కలిసి వెళ్లారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని