Cyclone Michaung: తుపాను ప్రభావం తగ్గేవరకు అప్రమత్తంగా ఉండాలి: నెల్లూరు కలెక్టర్‌ ఆదేశాలు

మిగ్‌జాం తుపాను నేపథ్యంలో అధికారులకు నెల్లూరు జిల్లా కలెక్టర్‌ హరినారాయణన్‌ ఆదేశాలు జారీ చేశారు.

Published : 04 Dec 2023 08:19 IST

నెల్లూరు: మిగ్‌జాం తుపాను నేపథ్యంలో అధికారులకు నెల్లూరు జిల్లా కలెక్టర్‌ హరినారాయణన్‌ ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం సాయంత్రం వరకు భారీ నుంచి అతిభారీ వర్షాలతో పాటు 100కి.మీ. వేగంలో గాలులు వీస్తాయని.. అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. తుపాను ప్రభావం తగ్గేవరకు జిల్లా నుంచి గ్రామస్థాయి వరకు అధికారులు, సిబ్బంది ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. కచ్చా ఇళ్లు, గుడిసెల్లో ఉన్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. తీర ప్రాంతాల్లోని 9 మండలాల్లో బృందాలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని