Poll violence: ఎన్నికల్లో హింస.. బదిలీ అయినవారి స్థానంలో కొత్త నియామకాలు

ఎన్నికల హింస ఘటనల్లో బదిలీ అయిన వారి స్థానంలో ఈసీ కొత్త నియామకాలు చేపట్టింది.

Updated : 20 May 2024 15:10 IST

అమరావతి: ఏపీ ఎన్నికల్లో హింస చెలరేగడంపై పలువురు ఉన్నతాధికారుల పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఈసీ వారిపై సస్పెన్షన్‌, బదిలీ వేటు వేసిన విషయం తెలిసిందే. దీంతో బదిలీ అయిన స్థానాల్లో కొత్త నియామకాలు చేపట్టారు. డీఎస్పీలుగా ఐదుగురిని, ఇన్‌స్పెక్టర్లుగా ఏడుగురిని మొత్తంగా 12 మందికి పోస్టింగ్‌లు ఇస్తూ సీఈవో సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. 

నరసరావుపేట డీఎస్పీగా ఎం.సుధాకర్‌రావు, గురజాల డీఎస్పీగా సీహెచ్‌. శ్రీనివాసరావు, తిరుపతి డీఎస్పీగా రవి మనోహరాచారి, తాడిపత్రి డీఎస్పీగా జనార్దన్‌నాయుడు, తిరుపతి స్పెషల్‌ బ్రాంచ్‌కు ఎం.వెంకటాద్రిని నియమిస్తూ ఉత్తర్వులిచ్చారు. పూర్తి వివరాలను ఈ కింది పీడీఎఫ్‌లో చూడొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని