వాలంటీర్లతో లబ్ధి పొందాలని చూస్తే ఈసీ ఆదేశాలను ధిక్కరించినట్టే: నిమ్మగడ్డ రమేశ్‌

వాలంటీర్ల ద్వారా లబ్ధిపొందాలని చూస్తే ఈసీ ఆదేశాలను ధిక్కరించినట్లే అవుతుందని సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ కార్యదర్శి నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ పేర్కొన్నారు.

Updated : 28 Feb 2024 17:31 IST

కాకినాడ: వాలంటీర్ల ద్వారా లబ్ధిపొందాలని చూస్తే ఈసీ ఆదేశాలను ధిక్కరించినట్లే అవుతుందని సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ కార్యదర్శి నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ పేర్కొన్నారు. ఎన్నికల విధులకు వాలంటీర్లను దూరంగా ఉంచాలని కోర్టు ఆదేశించినా.. దానికి భిన్నంగా అధికార పార్టీ వ్యవహరిస్తోందని విమర్శించారు. కాకినాడలో నిర్వహించిన ‘ఓటు వేద్దాం-ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేద్దాం’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 

‘‘తిరుపతి ఉప ఎన్నికల్లో నకిలీ ఈఆర్‌వో పనిచేశారు. ఎన్నికల్లో ఇలా నకిలీ అధికారులు పనిచేయడం ఆందోళన కలిగిస్తుంది. ఓటర్ల వివరాలను వాలంటీర్లు అధికార పార్టీకి అందిస్తున్నారు. వైకాపా కోసం వాలంటీర్లు కష్టపడాలన్న మంత్రుల వ్యాఖ్యలను ఖండిస్తున్నా. అధికారులు ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించాలి. నిర్లక్ష్యం చేస్తే ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తాం’’ అని చెప్పారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని