AP News: మెగా డీఎస్సీ కోసం మంత్రి బుగ్గన ఇంటి ముట్టడి..

‘దగా డీఎస్సీ వద్దు.. మెగా డీఎస్సీ ముద్దు’ అంటూ నంద్యాల జిల్లా డోన్‌లో ఎన్‌ఎస్‌యూఐ నాయకులు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి ఇంటిని ముట్టడించారు.

Updated : 17 Feb 2024 14:54 IST

డోన్‌ నేర విభాగం: ‘దగా డీఎస్సీ వద్దు.. మెగా డీఎస్సీ ముద్దు’ అంటూ నంద్యాల జిల్లా డోన్‌లో ఎన్‌ఎస్‌యూఐ నాయకులు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి ఇంటిని ముట్టడించారు. 25 వేల టీచర్ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. మంత్రికి వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్తుండగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఆందోళనకారులను పట్టుకునే ప్రయత్నంలో పట్టణ సీఐ ప్రవీణ్ కుమార్ కింద పడిపోయారు. అనంతరం ఎన్‌ఎస్‌యూఐ నేతలను అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని