Warangal: కాకతీయ వర్సిటీ వీసీ రమేశ్‌పై విజిలెన్స్‌ విచారణకు ఆదేశం

కాకతీయ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్‌ రమేశ్‌పై రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్‌ విచారణకు ఆదేశించింది.

Updated : 18 May 2024 19:47 IST

హైదరాబాద్‌: కాకతీయ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్‌ రమేశ్‌పై రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్‌ విచారణకు ఆదేశించింది. నియామకాలు, బదిలీలు, బిల్లుల చెల్లింపుల్లో అక్రమాలకు పాల్పడ్డారని రమేశ్‌పై ఆరోపణలు ఉన్నాయి. పలువురు కేయూ అధ్యాపకులు కూడా ఆయనపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో వీసీ రమేశ్‌పై విజిలెన్స్‌ విచారణ జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు ప్రభుత్వానికి అందిన ఫిర్యాదులను విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం.. విజిలెన్స్‌ డీజీకి పంపించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని