Malika Garg: చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవ్‌.. మలికా గార్గ్‌ హెచ్చరిక

పల్నాడు జిల్లా నూతన ఎస్పీగా మలికా గార్గ్‌ బాధ్యతలు స్వీకరించారు. జూన్‌ 4న కౌంటింగ్‌ సజావుగా జరిగేలా చూడటమే తన మొదటి లక్ష్యమన్నారు.

Updated : 20 May 2024 19:30 IST

పల్నాడు: పల్నాడు జిల్లా నూతన ఎస్పీగా మలికా గార్గ్‌ బాధ్యతలు స్వీకరించారు. జూన్‌ 4న కౌంటింగ్‌ సజావుగా జరిగేలా చూడటమే తన మొదటి లక్ష్యమన్నారు. శాంతిభద్రతలను అదుపులోకి తేవడమే తన ముందున్న లక్ష్యమని చెప్పిన ఆమె.. కొన్ని ఘటనల కారణంగా శాంతిభద్రతలు అదుపు తప్పాయన్నారు. నాయకులు చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. పల్నాడు జిల్లాలో ప్రశాంత వాతావరణానికి కృషి చేస్తానని తెలిపారు. పోలీసు అధికారులు తప్పుడు చర్యలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని