Pawan Kalyan: రామోజీరావు పార్థివదేహానికి నివాళులర్పించిన పవన్‌ కల్యాణ్

రామోజీగ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు పార్థివదేహానికి జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ నివాళులర్పించారు.

Updated : 08 Jun 2024 20:32 IST

హైదరాబాద్‌: రామోజీగ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు పార్థివదేహానికి జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌, నిర్మాత రాధాకృష్ణ (చినబాబు) నివాళులర్పించారు. అనంతరం రామోజీ కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

‘‘రామోజీరావు మరణ వార్త చాలా దిగ్భ్రాంతి కలిగించింది. ప్రమాణ స్వీకారం తర్వాత వచ్చి ఆయన్ను కలుద్దామనుకున్నా. కానీ, ఇంతలోనే దురదృష్టవశాత్తూ కన్నుమూశారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వేలాది మంది జర్నలిస్టులు ఈనాడు జర్నలిజం స్కూల్‌ నుంచి వచ్చిన వారే. ఎంతో మంది జర్నలిస్టులను అందించిన మహానుభావులు ఆయన. తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ఎంతో చేశారు. అత్యున్నత ప్రమాణాలతో గొప్ప ఫిల్మ్‌సిటీని నిర్మించారు. ఆయన కుటుంబ సభ్యులకు భగవంతుడు అండగా ఉండాలి. జనసేన తరఫున సంతాపం తెలియజేస్తున్నా’’ అని పవన్‌ కల్యాణ్ అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని