Kaleshwaram: అఫిడవిట్‌ సమర్పించాలని కాళేశ్వరం ఇంజినీర్లకు చెప్పాం: జస్టిస్‌ పీసీ ఘోష్‌

కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్‌ పీసీ ఘోష్‌ విచారణ కమిషన్‌ కొనసాగుతోంది. ప్రాజెక్టు బాధ్యతలు చూసిన ఇంజినీర్లను విచారించారు.

Updated : 11 Jun 2024 15:45 IST

హైదరాబాద్‌: కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంపై జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ విచారణ కొనసాగుతోంది. 3 ఆనకట్టల బాధ్యతలు చూసిన ఇంజినీర్లను విచారిస్తున్నామని, అఫిడవిట్‌ ద్వారా అన్ని విషయాలు తెలపాలని వారిని ఆదేశించినట్లు జస్టిస్‌ పీసీ ఘోష్ మీడియాకు తెలిపారు. ‘‘జూన్‌ 25లోపు నివేదిక సమర్పించాలని ఇంజినీర్లందరికీ చెప్పాం. అఫిడవిట్‌ ద్వారా అయితే అన్ని అంశాలు రికార్డు అవుతాయి. బ్యారేజీల విషయంలో లెక్కలు ఎక్కడో తప్పినట్లు కనిపిస్తోంది. లోపం ఎక్కడుంది? ఎవరి ప్రమేయమైనా ఉందా? అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. నిర్మాణ సంస్థల ప్రతినిధులను కూడా విచారణకు పిలుస్తాం’’అని జస్టిస్‌ పీసీ ఘోష్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని