Andhra News: AP news: ఏపీలో పింఛన్ల పంపిణీ.. ఈసీ మార్గదర్శకాలు జారీ

పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వం విధి విధానాలు ఖరారు చేసింది. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) సీఈఓ ఆదేశాలను సవరిస్తూ ఈసీ మార్గదర్శకాలు జారీ చేసింది.

Updated : 02 Apr 2024 20:24 IST

అమరావతి: ఏపీలో పింఛన్ల పంపిణీపై  ఎన్నికల సంఘం విధి విధానాలు ఖరారు చేసింది. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) సీఈఓ ఆదేశాలను సవరిస్తూ ఈసీ మార్గదర్శకాలు జారీ చేసింది. బుధవారం నుంచి ఏప్రిల్‌ 6 వరకు కేటగిరీల వారీగా పంపిణీ చేయాలని మార్గదర్శకాల్లో పేర్కొంది. కొందరికి ఇంటివద్దే ఇవ్వడంతోపాటు, మిగిలిన వారికి గ్రామ, వార్డు సచివాలయాల వద్ద పంపిణీకి ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది. దివ్యాంగులు, తీవ్ర అనారోగ్యంతో బాధ‌ప‌డేవారు, అస్వస్థతకు గురైన‌వారు, వితంతువుల‌కు ఇంటివ‌ద్దే పింఛన్‌ ఇవ్వాలని నిర్ణయించింది. గ్రామ స‌చివాల‌యాల‌కు చాలా దూరంగా ఉన్న గిరిజన ప్రాంతాల వారికోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాల‌ని కలెక్టర్లను ఆదేశించింది.

ప్రస్తుతం గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.27 లక్షల సిబ్బంది ఉన్నట్టు గుర్తించిన ప్రభుత్వం.. సరిపడా ప్రభుత్వ ఉద్యోగులు లేకపోవటంతో  రెండు కేట‌గిరీలుగా పింఛన్లు పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఉద‌యం 9 గంటల నుంచి రాత్రి 7 గంట‌ల వ‌ర‌కూ స‌చివాల‌యాలు ప‌నిచేయాల‌ని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఈ నెల 3 తేదీ మధ్యాహ్నం నుంచి ప్రారంభించి ఏప్రిల్ 6 నాటికి పంపిణీ ముగించాలని ఆదేశించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు