TSRTC: కారుణ్య నియామకాలకు టీఎస్‌ఆర్టీసీ గ్రీన్‌ సిగ్నల్‌

టీఎస్‌ఆర్టీసీలో పదేళ్లుగా కారుణ్య నియామకాల కోసం ఎదురు చూస్తోన్న అభ్యర్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది.

Updated : 10 Jan 2024 18:29 IST

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ)లో పదేళ్లుగా కారుణ్య నియామకాల కోసం ఎదురుచూస్తోన్న అభ్యర్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 813 మందిని కండక్టర్లుగా తీసుకోవడానికి రంగం సిద్ధం చేసింది. విధి నిర్వహణలో మరణించిన సిబ్బంది వారసులతో ఆ పోస్టులను భర్తీ చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

బ్రెడ్ విన్నర్ (కారుణ్య నియామ‌కాలు), మెడికల్ ఇన్‌వ్యాలిడేషన్ స్కీమ్ కింద ఉద్యోగుల జీవిత భాగస్వామి లేదా వారి పిల్లలకు ప్రత్యామ్నాయ ఉపాధిని అందించడానికి వారి విద్యార్హత‌లను బట్టి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. ప్రభుత్వ నిర్ణయంతో విధి నిర్వహణలో ఉండగా మరణించిన సిబ్బంది కుటుంబాలకు భారీ ఊరట లభించనుంది. హైద‌రాబాద్ రీజియన్‌ పరిధిలో 66, సికింద్రాబాద్ 126, రంగారెడ్డి 52, న‌ల్గొండ 56, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ 83, మెద‌క్ 93, వ‌రంగ‌ల్ 99, ఖ‌మ్మం 53, అదిలాబాద్ 71, నిజామాబాద్ 69, క‌రీంన‌గ‌ర్‌ రీజియన్‌లో 45.. మొత్తం 813 కండ‌క్టర్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే.. పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న కండక్టర్ నియామకాలు చేపడుతున్నామని మంత్రి తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని