TS high court: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు.. తెలంగాణ హైకోర్టులో సుమోటో విచారణ

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్‌ వ్యవహారాన్ని తెలంగాణ హైకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది. పలు పత్రికల్లో వరస కథనాలు రావడంతో ఈ మేరకు స్పందించింది.

Updated : 03 Jun 2024 22:18 IST

హైదరాబాద్‌: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్‌ వ్యవహారాన్ని తెలంగాణ హైకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది. పలు పత్రికల్లో వరస కథనాలు రావడంతో ఈ మేరకు స్పందించింది. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ఎస్ఐబీ మాజీ అధికారులు ప్రభాకర్ రావు, భుజంగరావు, ప్రణీత్‌రావు, తిరుపతన్న నిందితులుగా ఉన్న విషయం తెలిసిందే. భారాస మూడోసారి అధికారంలోకి రావడానికి తామంతా కలిసి పలువురు రాజకీయ నేతల ఫోన్లు ట్యాప్ చేసినట్లు ఇటీవలే పోలీసుల వాంగ్మూలంలో భుజంగరావు వెల్లడించారు.

ఈ విషయంపై పత్రికల్లో వెలువడిన కథనాలను న్యాయస్థానం పరిగణనలోకి తీసుకుంది. గతంలో టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో హైకోర్టు న్యాయమూర్తి ఫోన్‌ను సైతం ట్యాప్‌ చేసినట్లు భుజంగరావు అంగీకరించినట్లు పత్రికల్లో వార్తలు ప్రచురితమయ్యాయి. వాటిని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌ అరాధే ధర్మాసనం సుమోటోగా స్వీకరించింది. మంగళవారం మధ్యాహ్నం ఈ పిటిషన్‌ను ధర్మాసనం విచారించనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని