Pinarayi Vijayan: కేరళ కష్టాల్లో ఉన్నప్పుడు రామోజీరావు ఆదుకున్నారు: కేరళ సీఎం

రామోజీరావు మృతి పట్ల కేరళ సీఎం పినరయి విజయన్‌ సంతాపం వ్యక్తం చేశారు.

Updated : 08 Jun 2024 13:38 IST

తిరువనంతపురం: రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు మృతి పట్ల కేరళ సీఎం పినరయి విజయన్‌ సంతాపం వ్యక్తం చేశారు. మీడియా, సినీ రంగాల్లో ఆయన సేవలు మరువలేనివన్నారు. కేరళ కష్టాల్లో ఉన్నప్పుడు రామోజీరావు ఆదుకున్నారని గుర్తుచేశారు. వరదలు అతలాకుతలం చేసినపుడు అండగా నిలిచారని చెప్పారు. వరద బాధితుల కోసం రామోజీ ఫౌండేషన్‌ ఇళ్లు నిర్మించిందని గుర్తుచేశారు. ఉత్సుకత, దూరదృష్టి, సంకల్పంతో ప్రవేశించిన ప్రతి రంగంలో రామోజీరావు చెరగని ముద్ర వేశారని.. ఎంతోమందిలో స్ఫూర్తి నింపారని తెలిపారు. ఆయన మరణం దేశానికి తీరని లోటు అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని