Palnadu: పిన్నెల్లి లొంగిపోతారని ప్రచారం.. నరసరావుపేటలో పోలీసుల పహారా

మాచర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లొంగిపోతారన్న అనుమానంతో పల్నాడు జిల్లా నరసరావుపేట పోలీసులు అప్రమత్తమయ్యారు.

Updated : 23 May 2024 15:53 IST

నరసరావుపేట: మాచర్ల (Macherla) వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (Pinnelli Ramakrishna Reddy) లొంగిపోతారన్న అనుమానంతో పల్నాడు (Palnadu) జిల్లా నరసరావుపేట పోలీసులు అప్రమత్తమయ్యారు. నరసరావుపేట కోర్టు ఆవరణలో పోలీసులు పహారా కాస్తున్నారు. రెంటచింతల మండలం పాల్వాయిగేటు పోలింగ్‌ కేంద్రంలో ఈవీఎంను ధ్వంసం చేసిన కేసులో పిన్నెల్లి ఏ1 నిందితుడిగా ఉన్నారు. ఆయన కోసం ఇప్పటికే ఎస్పీ, డీఎస్పీ ఆధ్వర్యంలో 8 ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. నిన్న తెలంగాణలోని సంగారెడ్డి సమీపంలో పిన్నెల్లి పోలీసుల కళ్లుగప్పి తప్పించుకున్నారు. ఎమ్మెల్యే కారును గుర్తించి గన్‌మెన్‌, డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. విదేశాలకు పారిపోకుండా ఇప్పటికే లుకౌట్‌ నోటీసులు కూడా జారీ చేశారు. ఈ నేపథ్యంలో పిన్నెల్లి గురువారం నరసరావుపేట కోర్టులో లొంగిపోవచ్చన్న అనుమానంతో అప్రమత్తమైనట్టు పోలీసులు తెలిపారు. కేవలం అనుమానం మాత్రమేనని ఎలాంటి సమాచారం లేదని వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు