MLC election: వరంగల్‌-ఖమ్మం-నల్గొండ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 72.44 శాతం పోలింగ్‌

వరంగల్‌-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 72.44 శాతం పోలింగ్‌ నమోదైందని ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది.

Published : 28 May 2024 21:25 IST

హైదరాబాద్‌: వరంగల్‌-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 72.44 శాతం పోలింగ్‌ నమోదైందని ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. నియోజకవర్గవ్యాప్తంగా 4,63,839 ఓట్లకు గాను  3,36,013 ఓట్లు పోలయ్యాయని రిటర్నింగ్‌ అధికారి హరిచందన తెలిపారు. 2021 మార్చిలో జరిగిన ఎన్నికల్లో 76.35 శాతం పోలింగ్‌ నమోదైంది. ఈసారి పోలింగ్‌ శాతం తగ్గింది. జూన్‌ 5న నల్గొండలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. తీన్మార్‌ మల్లన్న (కాంగ్రెస్‌), రాకేశ్‌రెడ్డి (భారాస), ప్రేమేందర్‌రెడ్డి (భాజపా) బరిలో ఉన్న విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు