TSPSC: మార్చి 27 వరకు గ్రూప్‌-1 దరఖాస్తుల సవరణకు అవకాశం: టీఎస్‌పీఎస్సీ

గ్రూప్‌-1 (Group-1) దరఖాస్తుల్లో పొరపాట్లు సవరించుకునేందుకు శనివారం నుంచి ఎడిట్‌ ఆప్షన్ అందుబాటులోకి రానుంది. 

Published : 22 Mar 2024 22:18 IST

హైదరాబాద్‌: గ్రూప్‌-1 (Group-1) ఉద్యోగ దరఖాస్తుల్లో పొరపాట్లు సవరించుకునేందుకు శనివారం నుంచి ఎడిట్‌ ఆప్షన్ అందుబాటులోకి రానుంది. టీఎస్‌పీఎస్సీ (TSPSC) వెబ్‌సైట్‌ ద్వారా ఈనెల 23న ఉదయం 10గంటల నుంచి 27వ తేదీ సాయంత్రం 5గంటల వరకు ఆన్‌లైన్‌లో సవరించుకోవచ్చని టీఎస్‌పీఎస్సీ తెలిపింది. అభ్యర్థి పేరు, పుట్టిన తేదీ, విద్యార్హతలు, ఫొటో, సంతకం తదితర వ్యక్తిగత వివరాల్లో పొరపాట్లను సరిదిద్దుకోవచ్చని పేర్కొంది. సవరణ కోసం తగిన ధ్రువీకరణ పత్రాలను అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుందని తెలిపింది. రాష్ట్రంలో 563 గ్రూప్‌-1 ఉద్యోగాల కోసం దాదాపు 4.03 లక్షల మంది దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని