Vijayawada: సీఎం జగన్‌పై రాయి దాడి కేసులో అక్రమంగా ఇరికిస్తున్నారని ఆందోళన

సీఎం జగన్‌పై రాయి దాడి కేసులో తమవారిని అక్రమంగా నిర్బంధించారంటూ విజయవాడ వడ్డెరకాలనీ వాసులు ఆందోళనకు దిగారు.

Updated : 16 Apr 2024 19:42 IST

విజయవాడ: సీఎం జగన్‌పై రాయి దాడి కేసులో తమవారిని అక్రమంగా నిర్బంధించారంటూ విజయవాడ వడ్డెరకాలనీ వాసులు ఆందోళనకు దిగారు. పోలీసుల తీరుకు నిరసనగా డాబాకొట్ల సెంటర్‌లో రాస్తారోకో చేశారు. రూ.200 ఇస్తామని చెప్పి జగన్‌ రోడ్‌షోకు తీసుకెళ్లారని, ఇస్తామన్న డబ్బులు ఇవ్వకుండా తప్పుడు కేసులు బనాయించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కనీసం ఎక్కడున్నారో కూడా చెప్పడం లేదని ఆవేదనకు గురయ్యారు. సీఎంపై రాయి దాడి జరిగిన సమయంలో తమ వారు ఆ ప్రాంతంలో లేకపోయినా ఐదుగురు పిల్లలను ఈరోజు తెల్లవారుజామున పోలీసులు తీసుకెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమంగా ఈ కేసులో ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. వెంటనే విడుదల చేయకపోతే పెట్రోల్‌ పోసుకొని ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని