Bhadrachalam: భద్రాచలంలో నర్సింగ్‌ విద్యార్థిని మృతి.. కళాశాల వద్ద బంధువుల ఆందోళన

స్థానిక పారా మెడికల్ కళాశాల వద్ద ఆందోళనతో ఉద్రిక్తత నెలకొంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. నర్సింగ్‌ విద్యార్థిని కారుణ్య గురువారం ఉదయం అపస్మారక స్థితిలోకి వెళ్లారు.

Updated : 24 May 2024 12:27 IST

భద్రాచలం పట్టణం: నర్సింగ్‌ విద్యార్థిని అనుమానాస్పద మృతికి నిరసనగా భద్రాచలం పారా మెడికల్ కళాశాల వద్ద విద్యార్థులు, బంధువులు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. దీంతో ఇక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. నర్సింగ్‌ విద్యార్థిని కారుణ్య గురువారం ఉదయం అపస్మారక స్థితిలోకి వెళ్లారు. కళాశాల ప్రాంగణంలో గాయాలతో పడి ఉన్న ఆమెను.. యాజమాన్యం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించింది. అక్కడ చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం మృతి చెందింది. విద్యార్థిని మృతితో పారా మెడికల్‌ కళాశాల వద్ద శుక్రవారం బంధువులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వాసుపత్రి నుంచి ర్యాలీగా కళాశాల వద్దకు వచ్చారు. కారుణ్య కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. కళాశాలకు వచ్చిన ఛైర్మన్‌పై దాడికి విద్యార్థులు, బంధువులు యత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని