PSLV-C55: నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్‌వీ-సి55.. ప్రయోగం విజయవంతం

శ్రీహరికోట నుంచి పీఎస్‌ఎల్‌వీ-సీ55 రాకెట్‌ ప్రయోగం విజయవంతమైంది. రెండు విదేశీ ఉపగ్రహాలను నింగిలోకి మోసుకెళ్లింది.

Updated : 22 Apr 2023 16:21 IST

శ్రీహరికోట: భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన తిరుపతి జిల్లాలోని షార్‌ నుంచి పొలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌(పీఎస్‌ఎల్‌వీ)-సి55 రాకెట్‌ ప్రయోగం విజయవంతమైంది. ప్రయోగానికి ముందుగా నిర్వహించే కౌంట్‌డౌన్‌ ప్రక్రియ శుక్రవారం మధ్యాహ్నం 12.50 గంటలకు ప్రారంభమైంది. ఇది నిరంతరాయంగా 25.30 గంటల పాటు కొనసాగిన తర్వాత మధ్యాహ్నం 2.20 గంటలకు పీఎస్‌ఎల్‌వీ వాహకనౌక నింగిలోకి దూసుకెళ్లింది.

నింగిలోకి రెండు విదేశీ ఉపగ్రహాలు..

సింగపూర్‌కు చెందిన 741 కిలోల బరువుగల టెలీయోస్‌-2, 16 కిలోల లూమోలైట్‌-4 ఉపగ్రహాలను పీఎస్‌ఎల్‌వీ మోసుకెళ్లింది. టెలీయోస్‌-2 ఉపగ్రహం సింగపూర్‌ ప్రభుత్వానికి చెందింది. ఎస్టీ ఇంజినీరింగ్‌ భాగస్వామ్యంతో దీన్ని అభివృద్ధి చేశారు. ఉపగ్రహంలో సింథటిక్‌ ఎపర్చరు రాడార్‌ పేలోడ్‌ను ఉంచారు. అన్ని వాతావరణ పరిస్థితుల్లో రేయింబవళ్లు కవరేజీ అందించగలదు. లూమాలైట్‌-4 ఉపగ్రహాన్ని ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ఇన్ఫోకామ్‌ రీసెర్చ్‌, నేషనల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ సింగపూర్‌లోని శాటిలైట్‌ టెక్నాలజీ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్‌ ఆధ్వర్యంలో అభివృద్ధి చేశారు. సింగపూర్‌ ఇ-నావిగేషన్‌ సముద్ర భద్రతను పెంపొందించడం, ప్రపంచ షిప్పింగ్‌ కమ్యూనిటీకి ప్రయోజనం చేకూర్చడం దీని లక్ష్యం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని