ఆ పబ్‌లో కరెన్సీ నోట్లే అలంకరణ!
ఇంటర్నెట్ డెస్క్: వినియోగదారులను ఆకర్షించేందుకు ఖరీదైన వస్తువులతో అలంకరిస్తుంటాయి వాణిజ్య దుకాణాలు. ఇందుకోసం పెద్దమొత్తంలో డబ్బు ఖర్చు చేస్తాయి. కానీ, ఓ పబ్‌ను మాత్రం యాజమాన్యం డబ్బుతోనే అలంకరించింది. వాటి విలువ రూ.వందలు, వేలు కాదండోయ్.. రూ.కోట్లు ఉంటుంది. పబ్‌లో అలంకరించిన ఆ డబ్బుకు యజమానులు ఆదాయపన్ను చెల్లిస్తుండటం విశేషం. ఇంతకీ ఎక్కడుందా పబ్? నోట్లను ఎందుకు వేలాడదీస్తున్నారో తెలుసుకుందాం పదండి..
ఫ్లోరిడాలోని పెన్సాకోలా ప్రాంతంలో మెక్ గైర్ దంపతులు 1977లో మెక్ గైర్స్ ఐరీష్ పబ్‌ను ఏర్పాటు చేశారు. గైర్ సతీమణి మొల్లీ బేరర్‌గా ఉంటూ కస్టమర్ల ఆర్డర్లను తెచ్చి ఇచ్చేది. ఆమె సర్వీసు మెచ్చి ఒక వ్యక్తి ఒక డాలర్ నోట్ టిప్ ఇవ్వగా దానిపై తేదీ రాసి బార్‌లో టేబుల్‌కు అతికించింది. ఆ డాలర్ పబ్‌కు అదృష్టాన్ని తెస్తుందని ఆమె నమ్మింది. ఆ తర్వాత ఆమెకు టిప్ రూపంలో వచ్చే ప్రతి నోటును బార్‌లోనే అతికించడం మొదలుపెట్టింది. దీన్ని గమనించిన కస్టమర్లు నోటుపై వారి పేరు రాసి ఇవ్వడం ప్రారంభించారు. అలా కాలక్రమంలో పబ్ మొత్తం నోట్లమయమైపోయింది. దీంతో యాజమాన్యం టేబుల్స్‌కు, గోడలకు అతికించిన నోట్లను తీసి సీలింగ్‌కు వేలదీశారు. ప్రస్తుతం ఈ పబ్‌లో అలంకరించిన నోట్ల విలువ అక్షరాల 2మిలియన్ యూఎస్ డాలర్లు(రూ. 14.61కోట్లు).
ఎప్పటికప్పుడు నోట్ల సంఖ్య పెరుగుతుండటంతో యాజమాన్యం ఏటా వీటిని లెక్కగట్టి ఆదాయపు పన్ను కూడా చెల్లిస్తోంది. ఎవరైనా ఆ డబ్బును ఎత్తుకుపోతే? అని సందేహం రావొచ్చు. అందుకే ఎవరికీ అందకుండా నోట్లను సీలింగ్‌కు వేలాడదీశారు. అయినా కొన్నిసార్లు దొంగతనం జరిగి కొంత డబ్బు పోయిందని యజమానులు చెబుతున్నారు. అయితే, ఇక్కడి వేలాడదీసిన నోట్లపై కస్టమర్లు నలుపు రంగు పెన్నుతో చేసిన సంతకాలు ఉంటాయి. ఈ పబ్, నోట్లపై సంతకాలు చేసే సంప్రదాయం ఆ ప్రాంతంలో అందరికి తెలిసి ఉండటంతో కొట్టేసిన నోటు ఏ దుకాణంలో ఇచ్చినా వెంటనే పబ్ యాజమాన్యానికి విషయం తెలిసిపోతుంది. దొంగ దొరికిపోతాడు. అందుకే ఏ చింతా లేకుండా నోట్లను వేలాడదీసే సంప్రదాయాన్ని పబ్ కొనసాగిస్తోంది. ఇదొక్కటే కాదు.. ఫ్లోరిడాలోనే డెస్టిన్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన మరో పబ్‌లో కూడా నోట్లను అతికించే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Cuba: క్యూబా ప్రధాన చమురు నిల్వలో 40శాతం ఆహుతి..!
-
Sports News
Team India: భారత జట్టుకు అలాంటి ఆటగాళ్లే కావాలి: మాజీ క్రికెటర్
-
India News
Omicron: దిల్లీలో ఒమిక్రాన్ కొత్త వేరియంట్ కలకలం!
-
Politics News
Eatala Rajender: నేను సీఎం అభ్యర్థిని కాదు : ఈటల రాజేందర్
-
Movies News
Social Look: కేక్ ఎలా తినాలో నేర్చుకున్న హన్సిక.. ఆరెంజ్ జ్యూస్‌తో సంయుక్త!
-
General News
Heart Attack: గుండెపోటు ఎలా వస్తుందో తెలుసా..?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Prashant Kishor: నీతీశ్ అందుకే భాజపాను వీడారు..!
- Heart Attack: గుండెపోటు ఎలా వస్తుందో తెలుసా..?
- Viral Video: చీమల్ని తిన్న వీడియోకు 10మిలియన్ల వ్యూస్!
- Shilpa Shetty: చిత్రీకరణలో గాయపడ్డ శిల్పాశెట్టి
- Aamir Khan: ‘గత 48గంటల నుంచి నేను నిద్రపోలేదు’ : ఆమిర్‌ఖాన్
- UN: ఐరాస ఉగ్ర ఆంక్షల విధానాలపై మండిపడ్డ భారత్..!
- IIT Madrasలో రికార్డుస్థాయి ప్లేస్మెంట్లు..ఓ విద్యార్థికి ₹2కోట్ల వార్షిక వేతనం!
- Rohit sharma: ఈ ఫ్లాన్తోనే భారత క్రికెట్‌కు మంచి భవిష్యత్‌ను అందిస్తాం: రోహిత్ శర్మ
- Thief: ‘నన్ను క్షమించు తల్లీ’.. దేవతను వేడుకొని మరీ హుండీ ఎత్తుకెళ్లిన దొంగ
- Death Valley: డెత్ వ్యాలీలో వరద బీభత్సం.. అరుదైన వర్షపాతం నమోదు