Hyderabad: హైదరాబాద్‌లో భారీ వర్షం.. వనస్థలిపురం వద్ద భారీగా వరదనీరు

హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శనివారం సాయంత్రం వర్షం కురిసింది.

Updated : 18 May 2024 22:11 IST

హైదరాబాద్‌: హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శనివారం సాయంత్రం వర్షం కురిసింది. నగరంలోని మియాపూర్‌, చందానగర్‌, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, హైదర్‌నగర్‌, ఆల్విన్‌కాలనీ, నిజాంపేట్‌, ప్రగతినగర్‌, మేడ్చల్‌, కండ్లకోయ, దుండిగల్‌, గండిమైసమ్మ, ఎల్బీనగర్‌, వనస్థలిపురం తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. హైదరాబాద్‌లో గంటకు 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచాయి. ఉమ్మడి మెదక్‌ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తోంది. 

చెరువును తలపించిన జాతీయ రహదారి..

వనస్థలిపురం చింతలకుంట వద్ద జాతీయరహదారిపై భారీగా వరదనీరు చేరడంతో చెరువును తలపించింది. దీంతో పనామా- ఎల్బీనగర్‌ మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయమేర్పడింది. ఎల్బీనగర్‌ నుంచి హయత్‌నగర్‌ వరకు వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని