Weather: తెలంగాణ ప్రజలకు చల్లని కబురు.. మూడు రోజుల పాటు వర్షాలు

తెలంగాణలో రానున్న మూడు రోజులపాటు రాష్ట్రంలో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశమున్నట్లు వాతావరణశాఖ వెల్లడించింది.

Published : 22 Apr 2024 15:53 IST

హైదరాబాద్‌: తీవ్ర ఎండలతో ఉక్కిరి బిక్కిరవుతున్న తెలంగాణ ప్రజలకు చల్లని కబురు. రానున్న మూడు రోజులపాటు రాష్ట్రంలో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశమున్నట్లు వాతావరణశాఖ వెల్లడించింది. ఆదిలాబాద్‌, కొమురం భీం ఆసిఫాబాద్‌, నిజామాబాద్‌, జగిత్యాల, వికారాబాద్‌, సంగారెడ్డి, కామారెడ్డి, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో వాతావరణ శాఖ ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. గంటకు 30కి.మీ నుంచి 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు