Revanth Reddy: రాజీవ్‌గాంధీ సేవలు చిరస్మరణీయం: సీఎం రేవంత్‌

ఐటీ రంగ వృద్ధికి రాజీవ్‌ గాంధీ బాటలు వేశారని సీఎం రేవంత్‌రెడ్డి కొనియాడారు. నగరంలోని సోమాజిగూడలో రాజీవ్‌గాంధీ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు.

Updated : 21 May 2024 13:25 IST

హైదరాబాద్‌: ఐటీ రంగ వృద్ధికి రాజీవ్‌ గాంధీ బాటలు వేశారని సీఎం రేవంత్‌రెడ్డి కొనియాడారు. నగరంలోని సోమాజిగూడలో రాజీవ్‌గాంధీ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి ఆయన విగ్రహానికి నివాళి అర్పించారు. ప్రధానిగా దేశానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, జానారెడ్డి, వి.హనుమంతరావు, షబ్బీర్ అలీ, పార్టీ రాష్ట్ర వ్యవహవారాల ఇన్‌ఛార్జి దీపాదాస్‌ మున్షీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఖమ్మం జిల్లా కూసుమంచిలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాజీవ్‌గాంధీ విగ్రహానికి నివాళి అర్పించారు. అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి పొన్నం ప్రభాకర్‌ అక్కడి న్యూయార్క్‌ టైమ్స్‌ స్క్వేర్‌ వద్ద నిర్వహించిన వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు.  


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని