Ramoji Rao: ముగిసిన రామోజీరావు అంతిమయాత్ర

రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు (Ramoji Rao) అంతిమయాత్ర ముగిసింది.

Updated : 09 Jun 2024 11:20 IST

హైదరాబాద్‌: రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు (Ramoji Rao) అంతిమయాత్ర ముగిసింది. రామోజీ ఫిల్మ్‌సిటీలోని నివాసం నుంచి ప్రారంభమైన యాత్ర.. ఆయన ముందే సిద్ధం చేసుకున్న స్మారక కట్టడం వరకు కొనసాగింది. అక్షర యోధుడికి కడసారి వీడ్కోలు పలికేందుకు వివిధ పార్టీలకు చెందిన నేతలు, రామోజీ గ్రూపు సంస్థల ఉద్యోగులు, ప్రజలు తరలివచ్చారు. రామోజీరావు పార్థివదేహం వద్ద కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఫిల్మ్‌సిటీలోని రామోజీ గ్రూపు కార్యాలయాల మీదుగా స్మారక కట్టడం వరకు అంతిమయాత్ర సాగింది.

అంతిమయాత్ర వాహనంపై కుమారుడు, ఈనాడు ఎండీ సీహెచ్‌ కిరణ్‌, కోడళ్లు శైలజా కిరణ్‌, విజయేశ్వరి, మనవరాళ్లు సహరి, బృహతి, దివిజ, కీర్తి సోహన, మనవడు సుజయ్‌, కుటుంబసభ్యులు ఉన్నారు. వీరితో పాటు సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ, తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కేంద్ర మాజీ మంత్రి, ఎమ్మెల్యే సుజనా చౌదరి తదితరులు వాహనంపై ఉన్నారు. 

రామోజీరావు తన స్మారక కట్టడాన్ని ముందే సిద్ధం చేసుకున్నారు. రామోజీ ఫిల్మ్‌సిటీలోని విశాలమైన ప్రాంతంలో ఆయన నిర్మాణం చేయించుకున్న ఆ స్మృతి కట్టడం వద్దే ఇప్పుడు అంతిమ సంస్కారాలు జరగనున్నాయి. తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియల జరగనున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని