GHMC: జీహెచ్‌ఎంసీ పరిధిలో రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం

జీహెచ్‌ఎంసీ పరిధిలో విద్యుత్ డిమాండ్ భారీగా పెరిగిపోతోంది.

Published : 18 Apr 2024 20:48 IST

హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ పరిధిలో విద్యుత్ డిమాండ్ భారీగా పెరిగిపోతోంది. గురువారం మధ్యాహ్నం రికార్డు స్థాయిలో 4,053 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ మైలురాయిని అధిగమించిది. 2023 ఏప్రిల్ 18న గరిష్ఠ డిమాండ్ 3,471 మెగావాట్లు. గతేడాదితో పోల్చితే ప్రస్తుతం 582 మెగావాట్ల డిమాండ్ పెరిగినప్పటికీ అధికారులు ఏలాంటి అంత‌రాయం లేకుండా నిరంత‌రం స‌ర‌ఫ‌రా చేశారు. అన్ని కేటగిరీల  వినియోగదారులకు నిరంతర విద్యుత్ సరఫరాను అందిస్తున్న విద్యుత్ శాఖకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మ‌ల్లు  అభినందనలు తెలిపారు. మేనెలలో విద్యుత్‌ డిమాండ్‌ మరింత పెరిగే అవకాశం ఉన్నందున విద్యుత్‌ సిబ్బంది, అధికారులు నిత్యం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇలాగే సేవలందించి వినియోగదారుల మన్ననలు పొందాలని సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని