Cyclone Michaung: మిగ్‌జాం ఎఫెక్ట్‌.. కోస్తాంధ్రకు రెడ్‌ అలర్ట్‌

నైరుతి బంగాళాఖాతం మీదుగా ఏర్పడిన మిగ్‌జాం తుపాను కారణంగా కోస్తాంధ్రకు వాతావరణ శాఖ రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది.

Updated : 04 Dec 2023 12:54 IST

విశాఖపట్నం: నైరుతి బంగాళాఖాతం మీదుగా ఏర్పడిన మిగ్‌జాం తుపాను కారణంగా కోస్తాంధ్రకు వాతావరణ శాఖ రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. ఈ నేపథ్యంలో తీరప్రాంత జిల్లాల్లో పాఠశాలలకు కలెక్టర్లు సెలవు ప్రకటించారు. తీరప్రాంతంలోని అన్ని జిల్లాల్లో కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేశారు. తుపాను ప్రభావంతో విశాఖ, గోదావరి జిల్లాలు, బాపట్ల, తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, కృష్ణా జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీని ప్రభావంతో పలు విమానాలు సైతం రద్దయ్యాయి.

నిజాంపట్నం వద్ద తీరం దాటనున్న తీవ్ర తుపాను

కాసేపట్లో మిగ్‌జాం తుపాను తీవ్ర తుపానుగా మారి నిజాంపట్నం వద్ద తీరం దాటనుంది. అది కోస్తాంధ్ర తీరానికి సమాంతరంగా కదలనుంది. ప్రసుత్తం కోస్తాంధ్ర తీరం వెంబడి భారీగా అలలు ఎగసిపడుతున్నాయి. సుమారు 1.5 మీటర్ల ఎత్తులో అలలు ఎగిసిపడటంతో తీరం అల్లకల్లోలంగా మారింది. అలల ప్రభావంతో సముద్రపు నీరు లోతట్టు ప్రాంతాల్లోకి చొచ్చుకువెళ్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు