Bandi Sanjay: బండి సంజయ్‌కు ఊరట.. అరెస్టు చేయొద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

ఉప్పల్, మేడిపల్లి పోలీస్ స్టేషన్లలో ఇటీవల నమోదైన కేసుల్లో భాజపా నేత బండి సంజయ్‌కు హైకోర్టులో ఊరట లభించింది.

Published : 03 Apr 2024 23:02 IST

హైదరాబాద్‌: ఉప్పల్, మేడిపల్లి పోలీస్ స్టేషన్లలో ఇటీవల నమోదైన కేసుల్లో భాజపా నేత బండి సంజయ్‌కు హైకోర్టులో ఊరట లభించింది. ఈనెల 11 వరకు బండి సంజయ్‌ని అరెస్టు చేయవద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. విచారణ జరపాల్సి వస్తే సీఆర్‌పీసీ 41ఏ నోటీసు ఇవ్వాలని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. గత నెల 27న సంజయ్‌పై ఉప్పల్, మేడిపల్లి పోలీస్‌ స్టేషన్లలో నమోదైన కేసులను కొట్టివేయాలని కోరుతూ వేసిన క్వాష్ పిటిషన్‌పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. చెంగిచర్లలో జరిగిన గొడవలో గాయపడిన వారిని పరామర్శించేందుకు వెళ్తుంటే పోలీసులు అక్రమ కేసులు బనాయించారని సంజయ్ తరఫు న్యాయవాది వాదించారు. పూర్తి వివరాలతో కౌంటరు దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించిన హైకోర్టు.. తదుపరి విచారణను ఈనెల 11కి వాయిదా వేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని