MLC Kavitha: తప్పుదోవ పట్టించేలా కవిత సమాధానాలు: రిమాండ్‌ అప్లికేషన్‌లో సీబీఐ

సీబీఐ అధికారులు 11 పేజీలతో కవిత రిమాండ్ అప్లికేషన్ దాఖలు చేశారు. ఇందులో పలు కీలక విషయాలు వెల్లడించారు.

Published : 15 Apr 2024 13:38 IST

దిల్లీ: సీబీఐ అధికారులు 11 పేజీలతో కవిత రిమాండ్ అప్లికేషన్ దాఖలు చేశారు. ఇందులో పలు కీలక విషయాలు వెల్లడించారు. మూడు రోజుల తమ కస్టడీలో ఆమె విచారణకు సహకరించలేదని పేర్కొన్నారు. శరత్ చంద్రారెడ్డి నుంచి తీసుకున్న రూ.14 కోట్ల వ్యవహారంపై ప్రశ్నించినట్లు చెప్పారు. ఉద్దేశపూర్వకంగానే తప్పుదోవ పట్టించేలా సమాధానాలు చెప్పారన్నారు.

‘‘శరత్ చంద్రారెడ్డి, గోరంట్ల బుచ్చిబాబు, విజయ్ నాయర్‌తో జరిగిన సమావేశాలపై ప్రశ్నలు అడిగాం. వాటికి కవిత సూటిగా సరైన సమాధానాలు ఇవ్వకుండా తప్పుదోవ పట్టించేలా వ్యవహరించారు. దర్యాప్తును, సాక్షులను ప్రభావితం చేయగలిగిన, పలుకుబడి గల వ్యక్తి ఆమె. కేసుకు సంబంధించిన ఆధారాలను ధ్వంసం చేసే అవకాశం ఉంది. డిజిటల్ పరికరాలు, డాక్యుమెంట్లను పరిశీలించాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో ఆమెకు 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించాలి’’ అని సీబీఐ రిమాండ్ అప్లికేషన్‌లో కోరింది. ఈమేరకు రౌజ్‌ అవెన్యూలోని సీబీఐ ప్రత్యేక కోర్టు ఆమెకు 9 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ విధించిన సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు