AP News: 20 మంది వైకాపా నేతలకు గన్‌మెన్ల తొలగింపు

కడప జిల్లాలో 20 మంది వైకాపా నేతలకు అనధికారికంగా ఇచ్చిన గన్‌మెన్‌లను ప్రభుత్వం తొలగించింది. 

Updated : 27 Feb 2024 18:26 IST

అమరావతి: కడప జిల్లాలో 20 మంది వైకాపా నేతలకు అనధికారికంగా ఇచ్చిన గన్‌మెన్‌లను ప్రభుత్వం తొలగించింది. ఎన్నికల సమయంలో ప్రతిపక్ష పార్టీలకు భద్రత కల్పించే అంశంలో ప్రభుత్వం వివక్ష చూపుతోందంటూ ఎన్నికల సంఘం (ఈసీ)కి ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. అధికార పార్టీ వారికి 2+2 నుంచి 4+4 వరకు గన్‌మెన్‌లను కేటాయిస్తూ.. ప్రతిపక్షాలకు 1+1 మాత్రమే ఇచ్చారని పేర్కొన్నారు. ఇది ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపుతుందన్నాని చెప్పారు. దీన్ని సరిదిద్దేందుకు తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈసీ ఆదేశాలతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు