Hyderabad: విశ్రాంత ఐఏఎస్‌ అధికారికి మూడేళ్ల జైలు, రూ.లక్ష జరిమానా

ఆదాయానికి మించి ఆస్తుల కేసులో విశ్రాంత ఐఏఎస్‌ అధికారి కవాడి నరసింహకు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం మూడేళ్ల జైలు, రూ.లక్ష జరిమానా విధించింది. 

Published : 31 Mar 2023 22:04 IST


హైదరాబాద్‌: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో విశ్రాంత ఐఏఎస్‌ అధికారి కవాడి నరసింహకు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం మూడేళ్ల జైలు, రూ.లక్ష జరిమానా విధించింది. మిజోరం కేడర్‌ ఐఏఎస్‌ అధికారిగా పనిచేసిన కవాడి నరసింహపై హైదరాబాద్‌ సీబీఐ విభాగం 2006లో కేసు నమోదు చేసింది. దర్యాప్తు జరిపిన సీబీఐ 2010లో హైదరాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. నరసింహ 1991 నుంచి 2006 వరకు మిజోరం ప్రభుత్వ కార్యదర్శిగా పనిచేసినప్పుడు ఆదాయానికి మించి రూ.32లక్షలు కూడబెట్టినట్టు సీబీఐ అభియోగం. సీబీఐ ఛార్జ్‌షీట్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం నరసింహను దోషిగా తేల్చి.. ఈ మేరకు తీర్పు వెలువరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని