AP News: సీఐడీ చీఫ్‌, ఏఏజీ మీడియా సమావేశాల వ్యయంపై ఆర్టీఐ దరఖాస్తు

చంద్రబాబుపై నమోదు చేసిన కేసుల వివరాలను మీడియాకు వెల్లడించేందుకు సీఐడీ చీఫ్‌ సంజయ్‌, ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి చేసిన వ్యయంపై వివరాలు కోరుతూ ఆర్టీఐ పిటిషన్‌ దాఖలైంది.

Published : 18 Jan 2024 22:05 IST

విజయవాడ: తెదేపా అధినేత చంద్రబాబుపై నమోదు చేసిన కేసుల వివరాలను మీడియాకు వెల్లడించేందుకు సీఐడీ చీఫ్ సంజయ్, ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి చేసిన వ్యయంపై వివరాలు కోరుతూ రాష్ట్ర గవర్నర్ కార్యాలయంలో ఆర్టీఐ పిటిషన్ దాఖలైంది. ప్రతిపక్షనేతపై దాఖలు చేసిన కేసుల వివరాలను వెల్లడించేందుకు సీఐడీ చీఫ్, ఏఏజీలు నిధులు దుర్వినియోగం చేయడంపై ఫిర్యాదు చేసిన సమాచార హక్కు పిటిషనర్.. కేసు వివరాల వెల్లడికి ప్రజాధనం వ్యయం చేయడం ద్వారా నిబంధనల ఉల్లంఘనకు పాల్పడిన ఇరువురిపై తీసుకున్న చర్యల వివరాలు కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.

ఈ పిటిషన్‌పై ఆరా తీసిన రాజ్ భవన్.. దరఖాస్తులో కోరిన వివరాలను సమర్పించాలని హోంశాఖ కార్యదర్శికి పంపింది. ఈ వ్యవహారంలో సీఐడీ చీఫ్‌పై వచ్చిన ఆరోపణలు, తీసుకున్న చర్యలపై నివేదిక ఇవ్వాలని డీజీపీని ఆదేశిస్తూ హోంశాఖ కార్యదర్శి హరీష్ కుమార్ గుప్త ఆయన కార్యాలయానికి నోట్ పంపారు. సీఐడీ చీఫ్ సంజయ్, అదనపు అడ్వొకేట్‌ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి.. చంద్రబాబుపై నమోదైన కేసుల వివరాలను మీడియాకు వెల్లడించేందుకు చేసిన వ్యయం వివరాలు ఇవ్వాల్సిందిగా రాష్ట్ర గవర్నర్ కార్యాలయానికి ఏపీ యునైటెడ్ ఫోరం ఫర్ ఆర్టీఐ అధ్యక్షుడు ఎన్ సత్యనారాయణ ఈ పిటిషన్ దాఖలు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు