Sankranti rush: హైదరాబాద్‌ - విజయవాడ హైవేపై సంక్రాంతి రద్దీ

సంక్రాంతి పండుగను పురస్కరించుకొని వచ్చే వాహనాలతో హైదరాబాద్‌ - విజయవాడ జాతీయ రహదారి రద్దీగా మారింది.

Published : 11 Jan 2024 14:41 IST

కంచికచర్ల: సంక్రాంతి పండుగను పురస్కరించుకొని వచ్చే వాహనాలతో హైదరాబాద్‌ - విజయవాడ జాతీయ రహదారి రద్దీగా మారింది. హైదరాబాద్‌లో నివసించే ఏపీ వాసులు స్వస్థలాలకు కార్లు, ఇతర వాహనాల్లో పయనమయ్యారు. ఈ క్రమంలో ఎన్టీఆర్‌ జిల్లా కంచికచర్ల మండలం కీసర టోల్‌ప్లాజా వద్ద వాహనాలు వరుస కట్టాయి. ఫాస్ట్‌ట్యాగ్‌ ఉన్నప్పటికీ వాహనాలు ఎక్కువగా వస్తుండటంతో నెమ్మదిగా కదులుతున్నాయి. అక్కడే ప్రతి వాహనాన్ని పోలీసులు తనిఖీ చేసి పంపిస్తుండటంతో మరింత జాప్యం జరుగుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు