Delhi liquor scam: దిల్లీ మద్యం స్కామ్‌.. సీబీఐ కేసులోనూ అప్రూవర్‌గా మారిన శరత్‌ చంద్రారెడ్డి

దిల్లీ మద్యం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. గతంలో ఈడీ కేసులో అప్రూవర్‌గా మారిన నిందితుడు శరత్‌ చంద్రారెడ్డి, సీబీఐ నమోదు చేసిన కేసులోనూ అప్రూవర్‌గా మారారు.

Published : 19 Apr 2024 16:32 IST

దిల్లీ: దిల్లీ మద్యం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. గతంలో ఈడీ కేసులో అప్రూవర్‌గా మారిన నిందితుడు శరత్‌ చంద్రారెడ్డి, సీబీఐ నమోదు చేసిన కేసులోనూ అప్రూవర్‌గా మారారు. సెక్షన్‌ 164 కింద సీబీఐ కోర్టులో వాంగ్మూలం ఇచ్చారు. ఆయన వాంగ్మూలాన్ని ప్రత్యేక కోర్టు జడ్జి నమోదు చేసుకున్నారు. దీంతో మద్యం వ్యవహారంలో సీబీఐ, ఈడీ వేర్వేరుగా నమోదు చేసిన 2 కేసుల్లోనూ శరత్‌చంద్రారెడ్డి అప్రూవర్‌గా మారినట్లయింది. దిల్లీ మద్యం వ్యవహారం కేసులో ఇటీవల ఎమ్మెల్సీ కవితను సీబీఐ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.  శరత్‌ చంద్రారెడ్డిని కవిత బెదిరించారంటూ సీబీఐ కోర్టుకు తెలిపింది. శరత్‌ చంద్రారెడ్డిని రూ.25 కోట్లు కవిత డిమాండ్‌ చేశారని న్యాయస్థానానికి వివరించింది. ఈ నెల 23వరకు సీబీఐ కోర్టు కవితకు జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని