HongKong: హాంకాంగ్‌లో సామూహిక సత్యనారాయణ వ్రతం

ది హాంకాంగ్‌ తెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం అత్యంత భక్తిశ్రద్ధలతో శాస్త్రోక్తంగా నిర్వహించారు.

Published : 25 Feb 2024 22:41 IST

హాంకాంగ్‌: వైశాఖ, మాఘ, కార్తీక మాసాల్లో ఏకాదశి, పౌర్ణమి నాడు సత్యనారాయన స్వామి వ్రతం ఆచరిస్తే శుభ ఫలితాలు సిద్ధిస్తాయని పురాణాల ద్వారా తెలుస్తోంది. ఏటా మాదిరిగానే ఈసారి కూడా మాఘ పౌర్ణమి సందర్భంగా శనివారం ది హాంకాంగ్‌ తెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం అత్యంత భక్తిశ్రద్ధలతో శాస్త్రోక్తంగా నిర్వహించారు. సమాఖ్య సభ్యులు ఆనందోత్సాహాల మధ్య కుటుంబాలతో వచ్చి వ్రతం ఆచరించారని వ్యవస్థాపక అధ్యక్షులు జయ పీసపాటి తెలిపారు. 

హాంగ్‌కాంగ్‌లో తమలపాకులు, వక్కలు దొరకడం కష్టమని, అయినా ప్రతి సంవత్సరం పూజ కోసం భారత్‌ నుంచి పలువురు పంపిస్తున్నారని చెప్పారు. తెలుగు పురోహితులు లేకపోవడంతో.. సభ్యుల్లోనే ఒకరు పూజ చేయిస్తారని వెల్లడించారు. ఈసారి మెరైన్‌ ఇంజినీర్‌ శివరాం రాంభట్ల ఎంతో భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ వ్రతం జరిపించారని, భక్తులందరికీ అన్నప్రసాదం అందించినట్టు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని